Skip to content

‘కింగ్’ మూవీ నుంచి ‘డాడీ కూల్…’ పాట విడుదల

‘తూ మిల్ జాయే’ చిత్రంలో తన రొమాంటిక్, యాక్షన్ యాంగిల్‌తో షారుఖ్ ఖాన్ అందరినీ ఆకట్టుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన నూతన చిత్రం ‘కింగ్’ నుంచి ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ అనే పాట ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. 15 సంవత్సరాల తర్వాత హిందీ సినిమాలోని అత్యంత ప్రియమైన ఆన్-స్క్రీన్ జంట షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ మళ్లీ కలిసి సందడి చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన ‘డాడీ కూల్’ పాటకు తన ఉత్సాహభరితమైన బీట్స్, ఆకట్టుకునే రిథమ్, మరపురాని రెట్రో గ్రూవ్‌తో బాలీవుడ్ సరికొత్త సొబగులు అద్దింది. ఈ ఉత్సాహభరితమైన పాటలో షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ డ్యాన్స్ ఫ్లోర్‌ను రఫ్ఫాడించారు. ఈ పాటకు షారుఖ్ ఖాన్ తనదైన లుక్, క్లాసిక్ బాలీవుడ్ హంగులను తీసుకురాగా.. కరీనా కపూర్ ఖాన్ తన స్టైలిష్, ఎప్పటికీ నిలిచిపోయే ప్రజెన్స్‌తో ఐకానిక్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మరోసారి అందరికీ చూపించారు.

ఫ్రాంక్ ఫారియన్, జార్జ్ రేయమ్ రచనలో బోనీ ఎం పాడిన ‘డాడీ కూల్’ పాటను స్పూర్తిగా తీసుకుని.. సచిన్-జిగర్ స్వరపరిచిన ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ ఆ ఐకానిక్ ట్రాక్‌కు బాలీవుడ్ సరికొత్త సొబగులు అద్దింది. జాతీయ అవార్డు గ్రహీతలైన గాయకులు అరిజిత్ సింగ్, శిల్పా రావు తమ గాత్రంతో ఈ వెర్షన్‌ను మరింత ఉత్సాహభరితంగా తీర్చిదిద్దారు. జాతీయ అవార్డు గ్రహీత కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు కంపోజ్ చేయగా, పరిశ్రమలోని అత్యుత్తమ ప్రతిభావంతులను ఒకచోట చేర్చి కుమార్ హిందీ సాహిత్యాన్ని రచించారు.

మెటా వారి ప్రతిష్టాత్మక కార్యక్రమం – హౌస్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ 2026లో ఈ పాటను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని 700 మందికి పైగా ప్రముఖ కంటెంట్ క్రియేటర్లు ఒకచోట చేరి ‘డాడీ కూల్ (కింగ్ వెర్షన్)’ను మరింత కూల్‌గా తీర్చిదిద్దారు.

‘కింగ్’ చిత్రం క్రిస్మస్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే రోజురోజుకీ సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. వస్తున్న ప్రతీ అప్డేట్ ఉత్కంఠను పెంచుతుండటంతో ‘కింగ్’ 2026లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవబోతోందని అర్థం అవుతోంది.

ఈ పాట ఇప్పుడు జీ మ్యూజిక్ కంపెనీ, టీ-సిరీస్ యూట్యూబ్ ఛానెళ్లలో అందుబాటులో ఉంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ‘కింగ్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మించాయి. ఈ చిత్రం 2026 డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.