షారుఖ్ ఖాన్ ‘కింగ్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్
షారుఖ్ ఖాన్ అభిమానులకు ఇంతకంటే మంచి పుట్టినరోజు కానుక మరొకటి ఉండదు. తన పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ బాద్‌షా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కింగ్’ సినిమా నుంచి తొలి పాట ‘తు మిల్ జాయే’ను విడుదల చేశారు. సంగీత, సినీ రంగాలకు చెందిన స్టార్స్ ఈ పాటను రూపొందించారు. అర్జిత్ సింగ్ అద్భుతమైన గాత్రం, ఎడ్ షీరన్ ప్రత్యేకమైన ర్యాప్ స్టైల్‌తో రూపొందిన ఈ పాట ఓ అరుదైన గ్లోబల్ మ్యూజిక్ కొలాబరేషన్‌గా రూపొందింది. అంతేకాదు.. వెండితెరపై ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె జోడీ మరోసారి ఈ పాటతో ప్రేక్షకులను అలరించనుంది. ‘కింగ్’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఈ మ్యూజిక్ వీడియో ప్రారంభమవుతుంది…
