Skip to content

‘అలియాస్ రుక్మిణి’ సినిమా తో బరాబర్ హిట్ ఇస్తున్నాం: హీరో నితిన్

‘అలియాస్ రుక్మిణి’ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా అద్భుతంగా వచ్చింది. నితిన్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను: నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘అలియాస్ రుక్మిణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఎంత బాగుంటుందో మీరే సినిమా చూశాక చెప్పండి. ఒక నటుడిగా గత రెండేళ్లుగా చాలా ఒత్తిడిలో ఉన్నాను. సరైన సినిమాలు, కథలు రావడం లేదు. కొన్ని నిద్రలేని రాత్రులు కూడా గడిపాను. ఈ కథ విన్న తర్వాత ఆ రోజు నుంచి హాయిగా నిద్రపోయాను. ఈరోజు వరకు ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. ఈ సినిమా ఎలాంటి కథలు చేయాలనే విషయంలో నా దృష్టికోణాన్ని మార్చింది. మా టీమ్ అందరికీ థాంక్యూ. దీప్తి గారు అద్భుతమైన ప్రొడ్యూసర్. తన నుంచి కొత్త ప్రొడ్యూసర్స్ చాలా నేర్చుకోవాలి. ‘దిల్’ సినిమాకు దిల్ రాజు గారితో పనిచేస్తున్నప్పుడు ఎంత మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, దీప్తి గారితో వర్క్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభవమే పొందాను. ఇదే అంకితభావంతో పనిచేయాలని కోరుకుంటున్నాను. తనతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది. తనకు వచ్చే ప్రతి మంచి కథ నాకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు ఫస్ట్ హీరో విజయ్ మ్యూజిక్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటికే రెండు పాటలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. బీజీఎం ఇంకా అద్భుతంగా ఉంటుంది. సృజన గారు నేను పనిచేసిన ఎడిటర్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్. అలాగే మా డీఓపీ గారికి థాంక్యూ. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. హీరోయిన్ ఆఫియాకు ఇది తొలి తెలుగు సినిమా. తను ఎంత అద్భుతంగా నటించిందంటే మీరందరూ తనని చాలా ఇష్టపడతారు. డైరెక్టర్ మురళి పేరు డిసెంబర్ 4 తర్వాత చాలా బలంగా వినిపిస్తుంది. ఇంతకుముందే చెప్పాను.. తను తెలుగు సినిమా రాజ్‌కుమార్ హీరోని, అలాగే రైటింగ్‌లో పూరి జగన్నాథ్. తనతో మరొకసారి కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ మురళికే దక్కుతుంది. సాయికుమార్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక దేవుడిలా నాని బాబు వచ్చారు. ఈ కథను నా చేతిలో పెట్టారు. తను ఆఫీస్‌కు వచ్చి ఈ కథ ఎలాగైనా చేయమని చెప్పారు. కథ విన్నాను. నిజంగా అదిరిపోయింది. నేను ఉన్న పరిస్థితుల్లో ఒక బంగారు పళ్లెం తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టుగా అనిపించింది. కథ విన్నప్పటి నుంచి ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఉన్నాను. డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి. అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈసారి బరాబర్ హిట్ ఇస్తున్నాను. అందరికీ థాంక్యూ సో మచ్.”

మూవీ ప్రజెంటర్ నాని మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా టీమ్ అందరూ చాలా ఎమోషనల్‌గా వాళ్ల మూమెంట్స్ షేర్ చేసుకున్నారు. మా అందరికీ ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఒక నిర్మాతగా ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సినిమా చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. కంటెంట్ విషయంలో చాలా తృప్తిగా ఉంది. చాలా ఆనందంగా ఉన్నాను. రిలీజ్ ముందు ఎలాంటి టెన్షన్ లేదు. మీ అందరితో కలిసి ఈ సినిమా చూడటానికి ఎదురుచూస్తున్నాను. డిసెంబర్ 3వ తేదీ రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి. అక్కడి నుంచి సెలబ్రేషన్స్ మొదలుకాబోతున్నాయి. మురళి ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. తనకంటూ ఒక ఒరిజినల్ వాయిస్ ఉంది. నేను కథ విన్నప్పుడు సినిమా ఎంత బాగుంటుందో అనుకున్నాను. దానికంటే మరింత బ్యూటిఫుల్‌గా సినిమా తీసిచ్చాడు. అందరూ కూడా సినిమాను హైలైట్ చేయడానికి పనిచేశారు. విజయ్ సినిమాకు ఇచ్చిన మ్యూజిక్, ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసిన విధానం చాలా బలంగా ఉంటుంది. తను ఈ సినిమాకు హైలైట్. మా వాల్ పోస్టర్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దీప్తి అక్క నాకు బలం. ఇది తన ప్రారంభం మాత్రమే. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలతో తను మీ అందరి ప్రేమాభిమానాలను గెలుచుకుంటుంది. ఆఫియా అద్భుతమైన నటి. రుక్మిణి పాత్రలో అద్భుతంగా చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత తనకు చాలా మంచి పేరు వస్తుంది. సాయికుమార్ గారు నా ఫేవరెట్ పర్సన్. నా ప్రతి సినిమాకు మొదటి బ్లెస్సింగ్స్ ఆయన దగ్గరి నుంచే వస్తాయి. అలాగే ఈ సినిమాలో పనిచేసిన హర్ష గారితో పాటు మిగతా నటీనటులందరూ బ్యూటిఫుల్‌గా చేశారు. ఈ సినిమాలో ఇంకా ఇద్దరు ముగ్గురు సర్‌ప్రైజింగ్‌గా ఉంటారు. చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. థాంక్యూ నితిన్. ఈ సినిమాలో చాలా స్పెషల్‌గా చేశారు. 20 ఏళ్లుగా తనతో పరిచయం ఉన్న నేనే సినిమా చూసి సర్‌ప్రైజ్ అయ్యాను. తను ఎంత అద్భుతమైన నటుడో మనందరికీ అర్థమవుతుంది. డిసెంబర్ 4న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కమ్‌బ్యాక్స్ ఆఫ్ ది ఇయర్ అవుతుందని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సినిమా చూసిన తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కృష్ణ పాత్రలో నితిన్ తప్ప మరొకరిని నేను ఊహించుకోలేకపోయాను. ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేయకుండా నేరుగా థియేటర్‌లో చూసి ఉంటే, కచ్చితంగా చాలా పెద్ద ట్వీట్ రాసి, ఆ టీమ్‌కు ఫోన్ చేసి, ‘నేను ప్రమోషన్స్‌కు ఏమైనా పనికొస్తానా?’ అని అడిగేవాడిని. అలాంటి సినిమా ఇది. ఈ సినిమాలో భాగం కావడం నిజంగా నా అదృష్టం. మీ హస్బెండ్‌ను ఈ సినిమాకు తీసుకెళ్తే, సినిమా చూసి తిరిగి వచ్చేటప్పటికి మీకు ఒక పర్సనల్ విన్‌లా అనిపిస్తుంది. అలాగే భర్త తన భార్యను సినిమాకు తీసుకెళ్తే, సినిమా చూసి ఇంటికి వచ్చేసరికి మీరు రెండు పాయింట్లు స్కోర్ చేసినట్టే. పదేళ్లు దాటిన మీ పిల్లలను తీసుకెళ్తే, ఒక మంచి సినిమా చూపించామనే సంతృప్తి ఉంటుంది. ఈ సినిమాలో చాలా అందమైన మ్యాటర్ ఉంది. అది తెలుసుకోవాల్సిన మ్యాటర్, చూడాల్సిన మ్యాటర్, వినాల్సిన మ్యాటర్. తప్పకుండా అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని బలంగా నమ్ముతున్నాను. డిసెంబర్ 3వ తేదీ రాత్రి అన్ని చోట్ల ప్రీమియర్స్ ఉంటాయి. సినిమా థియేటర్లలో చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం. అందరికీ థాంక్యూ సో మచ్.”

డైరెక్టర్ మురళీకాంత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ముందుగా మా డైరెక్షన్ టీమ్‌కు పేరుపేరునా ధన్యవాదాలు. నాని గారి నిర్మాణంలో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని భావిస్తున్నాను. మా డీవోపీ విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు. మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్, ఎడిటర్ అందరూ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. నన్ను ఎంతో సపోర్ట్ చేశారు. మీరందరూ థియేటర్స్‌కు రండి. నితిన్ అన్న ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేశాడో చూడండి. నితిన్ గారి ఫిల్మోగ్రఫీలో నా పేరు కూడా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. కచ్చితంగా సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. నాని గారు సినిమా చూసి ‘చాలా అద్భుతంగా తీశావ్ భయ్యా’ అని చెప్పడం నా జీవితంలో మర్చిపోలేను. నాని గారి ప్రొడక్షన్‌లో ప్రతి డైరెక్టర్ ఒక సినిమా చేయాలని కోరుకుంటాను. పాజిటివ్ మనుషులు ఎలా ఉంటారో మీకు తెలుస్తుంది. అలాంటి అవకాశం అందరికీ రావాలని కోరుకుంటున్నాను.”

హీరోయిన్ ఆఫియా మాట్లాడుతూ.. “ఇలాంటి ఒక వేదిక మీద నిలబడి ప్రేక్షకులతో మాట్లాడాలని నా కల. ఈ సినిమాతో అది తీరింది. మా డైరెక్టర్ గారికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో మాటల్లో తెలియడం లేదు. నితిన్ గారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన అద్భుతమైన నటుడు, చాలా గొప్ప వ్యక్తి. ఈ సినిమాలో నటించిన ప్రతి నటీనటులకు, టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాని గారి ప్రొడక్షన్‌లో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను.”

నిర్మాత దీప్తి గంటా మాట్లాడుతూ.. “ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో, సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను. మీరు చూస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ఇది చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. డిసెంబర్ 4న మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. నితిన్ గారు ఈ పాత్రలో ఎంత అద్భుతంగా ఇమిడిపోయారో, ప్రతి సీన్‌లో అంత అద్భుతంగా నటించారు. ఆఫియా రుక్మిణి క్యారెక్టర్‌లో చాలా చక్కగా ఒదిగిపోయింది. అలాగే నితిన్, సాయికుమార్ గారి సీన్లు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. హర్ష గారు చాలా ఫన్నీగా చేశారు. ప్రతి క్యారెక్టర్‌ను మురళి చాలా అద్భుతంగా రాశారు. మా టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మాకు ఈ ఫ్రీడమ్ వచ్చింది నాని దగ్గర నుంచి. తను ఈ జర్నీలో మాకు ఎంత సపోర్ట్ చేశారో మాటల్లో చెప్పలేను. ఇదంతా నాని వల్లే సాధ్యమైంది.”

డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ..మురళి గారి ‘దండోరా’ సినిమా చూశాను. నన్ను చాలా కదిలించింది. ఇప్పుడు తన రెండో సినిమానే నాని గారితో చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్, టీజర్, ట్రైలర్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. నాని ఓకే చేశారంటే కచ్చితంగా అందులో విషయం ఉంటుంది. ట్రైలర్‌లో ఏదో దాచారు. అది ఏంటో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. నితిన్ గారిని చూస్తేనే చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ‘అలియాస్ రుక్మిణి’ ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా కావాలని, ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ అలరించాలని కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. “మురళి గారి ‘దండోరా’ సినిమా చూశాను. అది నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ఆయనకు మరింత పెద్ద స్టార్డమ్ రావాలని కోరుకుంటున్నాను. నితిన్ గారి ఫస్ట్ లుక్ చూసిన తర్వాత చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. కచ్చితంగా ఈ సినిమాతో చాలా పెద్ద సక్సెస్ కొడతారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నితిన్ గారితో ‘రంగ్ దే’ సినిమా చేశాను. కాకపోతే అది అనుకున్నంత దూరం వెళ్లలేదు. ఆయనకు ఒక మంచి సక్సెస్ పడితే చూడాలని నా కోరిక. ఆ లోటు ‘అలియాస్ రుక్మిణి’ తీరుస్తుందని బలంగా నమ్ముతున్నాను. నాకు నటన ఆపేసి డైరెక్షన్ వైపు వెళ్లమని చెప్పిన హీరో నాని గారు. అప్పుడే ఆయన నాలో ఉన్న డైరెక్టర్‌ను ప్రోత్సహించారు. ఆయన నిజంగా టాలెంట్‌ను చాలా బాగా ఐడెంటిఫై చేస్తారు. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ.. “నాని గారి ప్రొడక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నారంటే ఒక మంచి సినిమా తీస్తున్నారని అర్థం. ఈ బ్యానర్ ప్రత్యేకత అలాంటిది. ఈ ట్రైలర్ చూసినప్పుడు మురళి గారికి డైరెక్టర్‌గా ఒక వైవిధ్యమైన వాయిస్ ఉందని అనిపించింది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. నితిన్ గారి ఫస్ట్ లుక్ చూసినప్పుడే చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆయన ఇమేజ్‌ను బ్రేక్ చేసి ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా ధైర్యంతో కూడుకున్న నిర్ణయం. తప్పకుండా ఈ సినిమా ఆయనకు చాలా పెద్ద సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ శైలేష్ కొలను మాట్లాడుతూ.. “నితిన్ నాని గారిని ఒకే చోట చూడడం చాలా హ్యాపీగా ఉంది. ట్రైలర్ చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. మురళి చాలా చక్కగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. డిసెంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్ చూడ్డానికి ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరెక్ట్ టైమ్‌లో ఈ సినిమా వస్తోంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.”

ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. “ఈ ట్రైలర్ చూసి నానికి, నితిన్‌కు సూపర్ హిట్ అని మెసేజ్ పెట్టాను. మురళితో పాటు మంచి టెక్నీషియన్స్ కలిసి చేసిన ఈ సినిమా డిసెంబర్ 4న సూపర్ హిట్ కాబోతోంది. డిసెంబర్ 4న నితిన్ అకౌంట్‌లో ఒక సక్సెస్ రాబోతోంది. కచ్చితంగా పార్టీ చేసుకుంటాం. నాని గారు సక్సెస్‌ఫుల్ హీరోగా ఉంటూ మరో హీరోతో సినిమాలు చేయడం అంత ఈజీ కాదు. తను ఈ విషయంలో సక్సెస్ అవుతున్నారు. తన కథల ఎంపిక చాలా వైవిధ్యంగా ఉంటుంది. తన జర్నీ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను.”

ప్రొడ్యూసర్ వెంకట్ బోయినపల్లి మాట్లాడుతూ.. “నాని గారి సినిమా అంటే మా సినిమానే. ఆయన కొత్త డైరెక్టర్లను, ప్రొడ్యూసర్లను ఎంతగానో ప్రోత్సహిస్తారు. నా జర్నీ నానితోనే మొదలైంది. ఆయనతోనే కంటిన్యూ అవుతోంది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.”

డైరెక్టర్ రామ్ జగదీష్ మాట్లాడుతూ.. “నాని గారు ప్రజెంట్ చేస్తున్నారంటేనే అది చాలా స్పెషల్. నాని గారితో సినిమా చేయడం చాలా అద్భుతమైన అనుభూతి. ట్రైలర్ చాలా బాగుంది. ‘జయం’ సినిమా నుంచి నాని గారి, నితిన్ గారి సినిమాలంటే మాకు చాలా ఇష్టం. తప్పకుండా ‘అలియాస్ రుక్మిణి’ బ్లాక్‌బస్టర్ హిట్ కాబోతోంది.”

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ మాట్లాడుతూ.. “నాని గారి ప్రొడక్షన్‌లో మూడు సినిమాలకు పనిచేశానని గర్వంగా చెప్పుకుంటాను. ఈ సినిమా కథ విన్నప్పుడు ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యానో, సినిమా చూస్తున్నప్పుడు కూడా దానికి మూడు రెట్లు ఎక్కువగా ఫీలయ్యాను. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ఇది నా బెస్ట్ వర్క్. నాని గారు, నితిన్ గారు కలిసి చేసిన ఈ సినిమాలో నేను మ్యూజిక్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ వేడుకలో సినిమా యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.