మే 18న రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ ట్రైలర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో ఇప్పటికే స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్ల, రెండు చార్ట్ బస్టర్ పాటలు, రెండు డిఫరెంట్ గ్లింప్స్ .. ప్రతి అప్‌డేట్‌కు అద్భుతమైన స్పందన లభించింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన 'పెద్ది', జూన్ 4న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానుంది. ఓవర్సీస్ ప్రీమియర్లు జూన్ 3న జరగనున్నాయి. రిలీజ్ కౌంట్‌డౌన్ ప్రారంభమవుతున్న తరుణంలో చిత్ర నిర్మాతలు ఒక కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న…
