అందర్నీ ఆలోచింపజేసే మిసెస్ కల్నల్ సినిమా
ఆది క్రియేషన్స్ బ్యానర్ మీద విలోక్, కౌశిక్ సమర్పణలో సాయి కృష్ణ నిర్మాతగా శ్రీకరం ప్రభాకర్ తెరకెక్కించిన చిత్రం ‘మిసెస్ కల్నల్’. ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ హీరోయిన్ , హీరో గా మాన్య గౌడ, మహేష్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న ఈ మూవీ టీజర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో.. దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘మిసెస్ కల్నల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాను. ఈ మూడేళ్లలో మేం ఎంతో యుద్ధం చేశాం. ఇది కేవలం లేడీ ఓరియెంటెడ్ సినిమా అని అనుకోవద్దు. ఇందులో అన్ని రకాల అంశాలుంటాయి. మా సినిమాని అందరూ సపోర్ట్ చేస్తారని…
