‘డార్క్ చాక్లెట్’ కొత్త అనుభూతినిస్తుంది: హీరో విశ్వదేవ్ రాచకొండ
విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్‌లో రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘డార్క్ చాక్లెట్’. శశాంక్ శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. యూఎస్ ప్రీమియర్స్‌లోనూ అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా నవంబర్ 13న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వదేవ్ రాచకొండ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు. యూఎస్ ప్రీమియర్స్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? యూఎస్ రివ్యూస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్రిటిక్స్, ఆడియన్స్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. సినిమా చాలా ఎంగేజింగ్‌గా ఉందని చెబుతున్నారు. అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు…
