‘డెకాయిట్’లో లవ్ స్టోరీ యాక్షన్ చూసి సర్‌ప్రైజ్ అవుతారు. – అడివి శేష్
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకిa రానుంది. ఈ సందర్భంగా హీరో అడివి శేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. డెకాయిట్ తెలుగు ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. హిందీ…
