‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది : నిర్మాత సుధాకర్ చెరుకూరి
మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించారు. జనవరి 13న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి బ్రేక్ ఈవెన్ అయింది కదా.. హ్యాపీగా ఉన్నారా? -చాలా హ్యాపీ. ఆంధ్ర మొత్తం ఆల్మోస్ట్ అయింది. ఇది లాంగ్ వీకెండ్. సోమవారం కూడా హాలిడే. నైజం తో పాటు మిగతా ఏరియాలో…
