ఘనంగా ‘స్కాలర్’ సినిమా ఫస్ట్ లుక్ ఆవిష్కరణ!
శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ & సంతోష్ ఫిలిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పొగాకు శిరీష మహేష్ న్యూ జెర్సీ యూఎస్ఏ వారి సౌజన్యంతో కౌశిక్, ప్రతిభా సిన్హా హీరో హీరోయిన్స్ గా, సుధాకర్ గౌడ్, పెంచల్ రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'స్కాలర్'. ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా తెలుగు ఫిలిం చాంబర్ వేదికగా శ్రీ లక్ష్మి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలిమ్స్ మరియు రామకృష్ణారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. గతంలో ఎన్నో సందేశాత్మక బాలల చిత్రాలను నిర్మించిన డాక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ కమర్షియల్ సందేశాత్మక చిత్రం 'స్కాలర్' (Scholar)…
