కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు బర్త్ డే స్పెషల్
నేడు (మార్చి 19) టాలీవుడ్ సీనియర్, లెజెండరీ నటుడు కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు పుట్టిన రోజు. సినీ పరిశ్రమలో ఆయన అడుగు పెట్టి ఇటీవలే యాభై ఏళ్లు అయిన సంగతి తెలిసిందే. ఇక విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, నటుడిగా మంచు మోహన్ బాబు అందుకున్న శిఖరాగ్రాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 1975లో సినీ కెరీర్‌ను ఆరంభించిన మోహన్ బాబు ఇప్పటికీ దిగ్విజయంగా దూసుకుపోతున్నారు. కుర్ర హీరోలు, యంగ్ జనరేషన్‌తో పోటీ పడుతూ మరీ మోహన్ బాబు నటిస్తున్నారు. ఒకప్పుడు విలన్‌గా తెలుగు సినీ పరిశ్రమకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చిన మోహన్ బాబు ఇప్పుడు డిఫరెంట్ పాత్రలతో నేటి తరాన్ని మెప్పించబోతోన్నారు. ‘స్వర్గం నరకం’ చిత్రంతో పరిశ్రమకు…
