Skip to content

15 నిమిషాలు శ్వాస ఆపి ఆశ్చర్యపరిచిన విద్యుత్ జమ్వాల్

ముంబైలో జరిగిన ‘స్ట్రీట్ ఫైటర్’ ప్రత్యేక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదికపై వరుసగా 15 నిమిషాల పాటు శ్వాసను నియంత్రిస్తూ ధ్యానం చేశారు. ధల్సిమ్ పాత్రలో నటిస్తున్న విద్యుత్ యోగా, కలరిపయట్టు వంటి భారతీయ కళల్లో తనకు ఉన్న నైపుణ్యాన్ని ఈ సందర్భంగా చూపించారు. హాలీవుడ్‌లో విద్యుత్ జమ్వాల్‌కు ‘స్ట్రీట్ ఫైటర్’ తొలి చిత్రం. ఇందులో ఆయన ప్రముఖ గేమింగ్ క్యారెక్టర్ ధల్సిమ్ పాత్రను పోషిస్తున్నారు. యోగా ఆయన సూపర్ పవర్‌గా ఉండే ఈ పాత్రకు విద్యుత్ సరిగ్గా సరిపోతారని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపించారు. ధల్సిమ్ వేషధారణలో ఉన్న కాస్ప్లేయర్లతో కలిసి విద్యుత్ వేదికపై 15 నిమిషాల పాటు మౌనంగా ధ్యానం చేశారు. అనంతరం…

Read more

నవదీప్‌ చేతుల మీదుగా ‘మొహబ్బత్‌’ సినిమా టీజర్‌ ఆవిష్కరణ

సంతోష్‌ , శ్రేయాస్‌ సేన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్‌' ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మ్యాక్‌ దర్శకత్వంలో అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్‌, దర్శకుడు కరుణకుమార్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సలీమ్‌ షేక్‌, దర్శకుడు మ్యాక్‌, సినిమాటోగ్రఫర్‌ వైఎస్‌ కృష్ణ, రచయిత కలాం, నటులు ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, శ్రేయాస్‌ సేన్, సంతోష్ , అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదీప్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. నవదీప్‌ మాట్లాడుతూ నిర్మాత అఫ్రోజ్‌ అమెరికాలో జాబ్‌ చేసి...వాళ్ల సొంత…

Read more

‘మొహబ్బత్‌’ సినిమా టీజర్‌ ఆవిష్కరణ

సంతోష్‌ రాజా, శ్రేయాస్‌ సేన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'మొహబ్బత్‌' ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మ్యాక్‌ దర్శకత్వంలో అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యకమ్రానికి ముఖ్య అతిథిగా హీరో నవదీప్‌, దర్శకుడు కరుణకుమార్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సలీమ్‌ షేక్‌, దర్శకుడు మ్యాక్‌, సినిమాటోగ్రఫర్‌ వైఎస్‌ కృష్ణ, రచయిత కలాం, నటులు ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, శ్రేయాస్‌ సేన్, సంతోష్ రాజా, అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవదీప్‌ టీజర్‌ను ఆవిష్కరించారు. నవదీప్‌ మాట్లాడుతూ నిర్మాత అఫ్రోజ్‌ అమెరికాలో జాబ్‌ చేసి...వాళ్ల సొంత…

Read more

‘తత్వం’లో క్లైమాక్స్‌ను ఎవరూ గెస్‌ చేయలేరు: దినేష్‌ తేజ

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. రేపు చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దినేష్‌ తేజ బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు. థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది. తత్వం సినిమాను ఒప్పుకోవడానికి రీజన్‌ ఏమిటి? ఈ సినిమాలో ఎవరూ గెస్‌ చేయలేని ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌లో ఉండే…

Read more

తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వ్యాపారవేత్తగా, తల్లిగా, ఫిట్‌నెస్‌ ప్రియురాలిగా, డిజిటల్ పర్సనాలిటీగా స్నేహా రెడ్డి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు 91 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. స్నేహా రెడ్డి నిర్వహిస్తున్న పికాబూ (Picaboo) స్టూడియో ఆమె వ్యాపార ప్రయాణంలో ముఖ్యమైన భాగంగా ఉంది. మరోవైపు ఫిట్‌నెస్, ఆరోగ్యంపై కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. తరచూ తన వర్కౌట్స్, యాక్టివ్ లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. కుటుంబానికి కూడా స్నేహా రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తన పిల్లలతో కలిసి…

Read more

‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రీ-రిలీజ్ అయిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన లభించింది. బాక్సాఫీస్ మోజో ప్రకారం, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలో సుమారు 86 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఉత్తర అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 60 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. దీంతో థియేట్రికల్ రీ-రిలీజ్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి భారత్ కూడా భారీగా సహకరించింది. తొలి వారాంతంలో ఇండియాలో సుమారు 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు…

Read more

‘తత్వం’లో నటించడం లక్కీగా ఫీలవుతున్నాను: హీరోయిన్‌ దష్విక

కొత్త కథలు, వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు. ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్‌ 2న చిత్రం థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా సోమవారం…

Read more

అక్టోబర్ 2న తత్వం సినిమా గ్రాండ్ రిలీజ్!

కొత్త కథతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా తెరకెక్కుతున్న చిత్రం 'తత్వం' మర్డర్‌ మిస్టరీ, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. కాగా ఈ చిత్రంను అక్టోబర్ 2 న సినిమాను థియేట్రికల్ విడుదల చేస్తూ నట్లు ప్రకటించారు మేకర్స్ . దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్ ఇది. సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌…

Read more

‘ప్రేమనే ఊరిలో’ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను – కామాక్షి భాస్కర్ల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక శనివారం నాడు మరో పాటను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్‌లో కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ .. ‘‘ప్రేమనే ఊరిలో’ అనే టైటిలే చాలా బాగుంది. టీజర్‌లో శ్రీకాంత్ గారి…

Read more

‘ప్రేమనే ఊరిలో’ సెప్టెంబర్ 25న రిలీజ్

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది. KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి…

Read more