నవంబర్ 14న “కొబ్బరిమట్ట” మూవీ రీ రిలీజ్
సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ "కొబ్బరిమట్ట" ప్రేక్షకుల్ని బాగా నవ్వించింది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం నవంబర్ 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన "కొబ్బరిమట్ట" ఆద్యంతం నవ్వించి మంచి విజయాన్ని అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ యాక్షన్, బ్లడ్ షెడ్ మూవీస్ వస్తున్న ఈ ట్రెండ్ లో "కొబ్బరిమట్ట" సినిమాలోని ఎంటర్ టైన్ మెంట్ ప్రేక్షకులకు ఒక మంచి రిలీఫ్ ఇవ్వనుంది. సంపూర్ణేష్ పాపారాయుడు, పెదరాయుడు, ఆండ్రాయిడు అనే మూడు…
