సూర్య ‘సీన్’ సినిమా నుండి ‘అమ్మో ఇది ఎవర్రా’ సాంగ్ రిలీజ్
హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య జాగరం స్టూడియోస్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టైటిల్ టీజర్‌ను విడుదల చేసి సినిమాలోని క్విర్కీ, ఎంటర్‌టైనింగ్ ప్రపంచాన్ని పరిచయం చేశారు. ఇప్పుడు మ్యూజికల్ జర్నీని ఫస్ట్ సింగిల్ ‘అమ్మో ఇది ఎవర్రా’తో ప్రారంభించారు. సుశిన్ శ్యామ్ కంపోజ్ చేసిన ఈ పాట ఫుట్‌ట్యాపింగ్ బీట్స్, వెంటనే ఆకట్టుకునే రిథమ్‌తో అదిరిపోయే ఎనర్జీని అందిస్తోంది. పాటలోని వైబ్రెంట్ మూడ్‌కు తగ్గట్టుగా…
