“కిల్లర్” మూవీ కోటి రూపాయల కాంటెస్ట్ లో ఎవరూ విన్ కాలేదు – డైరెక్టర్ పూర్వాజ్
ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి ప్రేక్షకులు థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చింది "కిల్లర్" మూవీ. ఈ సినిమాకు చేసిన కోటి రూపాయల కాంటెస్ట్ ప్రమోషన్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమా సెకండాఫ్ ట్విస్ట్ చెప్పిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. సినిమా రిలీజై సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ కోటి రూపాయల కాంటెస్ట్ గురించి వివరాలు తెలిపారు యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - మా సినిమాకు ఆడియెన్స్ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. క్రిటిక్స్ నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. కొందరు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వాటిని కూడా తీసుకున్నాం. ఓవరాల్ గా మా మూవీకి…
