మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడం నా అదృష్టం : నటుడు కరాటే కార్తి !!!
నటన అంటే ఎంతో ఇష్టం కావడంతో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాన్ని వదిలి సినిమా రంగంలోకి అడుగుపెట్టి.. కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రంలో జూనియర్ ఆర్టిస్టుగా తొలిసారి నటనకు శ్రీకారం చుట్టారు కరాటే కార్తి. ‘సింగం-3’, ‘దబాంగ్-3’, ‘బిగిల్’, ‘పేట’, ‘ఖైదీ’ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. సినీ రంగంలో తన 14 యేళ్ళ పోరాటానికి తగిన గుర్తింపు, విజయం ‘డాక్టర్’ చిత్రం ద్వారా దక్కిందని నటుడు కరాటే కార్తి అంటున్నారు. ఈ క్రమంలో హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’తో మంచి గుర్తింపుతో పాటు విజయం కూడా వరించిందని కార్తి పేర్కొన్నారు. తాజాగా కరాటే కార్తి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. మెగాస్టార్…
