ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా “కాసు” మూవీ గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్
యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ నందు నటిస్తున్న కొత్త సినిమా "కాసు". ఈ చిత్రంలో ఇందుకుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఎ.కె.ఆర్. డ్రీమ్ పిక్చర్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ పై ఇందు కుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్నారు. పి.ఎస్. హర్షవర్థన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం అతిథిగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లో "కాసు" సినిమా గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ అఖిల్ మాట్లాడుతూ - ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. దురాశ, నీతి వంటి అంశాలతో కథ సాగుతుంది…
