‘కాగితం పడవలు’ సినిమా ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంది : డైరెక్టర్ ఎంజీఆర్ తుకారాం
వర్ధన్, కృష్ణప్రియ హీరో హీరోయిన్లుగా ఎంజీఆర్ తుకారాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ ‘కాగితం పడవలు’. ఎస్ఎల్ఎన్ సినీ క్రియేషన్స్, ప్రణధి క్రియేషన్స్, నవ నారాయణ సినీ క్రియేషన్స్ బ్యానర్లపై కీర్తన నరేష్, T. R. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయత్రమ్మ అంజనప్ప నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో వర్ధన్ మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా కష్టపడి చేశాం. మీరందరూ ఇష్టపడి చూస్తారని నమ్ముతున్నాము…
