23 ఏళ్ల తర్వాత దర్శకుడు”కిరణ్ కర్నీడి” ఏ ఐ సినిమా “స్ట్రైకర్” తో రీ ఎంట్రీ!
2003లో "తొలి పరిచయం" చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన "కిరణ్ కర్నీడి" 23 ఏళ్ల విరమానంతరం "స్ట్రైకర్" చిత్రంతో తన సత్తాను చాటుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. నవంబర్ 25 తన పుట్టినరోజును పురస్కరించుకొని "ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ"తో తను రూపొందించిన పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ "స్ట్రైకర్" చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు!! విద్యాధికుడైన కిరణ్ కర్నీడి "గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్" సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. 'తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్" మరియు 'తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్'లో శాశ్వత సభ్యుడైన కిరణ్ కర్నీడి... మార్కెటింగ్ లో…
