‘కొక్కొరొకో’ నుంచి ‘సీతాకోకమ్మ’ పాట రిలీజ్
ప్రముఖ దర్శకుడు, నిర్మాత రమేష్ వర్మ ప్రస్తుతం యంగ్ టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నారు. ఇండస్ట్రీలోకి కొత్త తరాన్ని తీసుకు రావాలనే ఉద్దేశంతోనే ఆర్వీ ఫిల్మ్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థ నుంచి తొలి ప్రయత్నమైన ‘కొక్కొరొకో’, ఐదు విభిన్న పాత్రలతో కూడిన ఒక ఆంథాలజీ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాతో శ్రీనివాస్ వసంతాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే ‘కొక్కొరొకో’ గ్లింప్స్, పోస్టర్లు అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం నాడు ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘కొక్కొరొకో’ నుంచి ‘సీతాకోకమ్మ’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శీను, పార్వతిల మధ్య ఉన్న సున్నితమైన ప్రేమను ఒక హృద్యమైన బాణీతో అందంగా పరిచయం చేస్తుంది. ఎస్. కృష్ణ…
