భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల!
ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే 'అగ్లీ స్టోరీ' ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్…
