‘మహావీర్ కర్ణ’ డిసెంబర్ 4న రిలీజ్
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు పెన్ మూవీస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్.. ఆర్‌వీ స్టూడియోస్‌తో కలిసి ‘మహావీర్ కర్ణ’ అనే ఎపిక్ హైబ్రిడ్ లైవ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాయి. భారతీయ సినిమాను సరికొత్త విజువల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌గా సక్సెస్ అయిన ‘రాక్షసుడు’, ‘ఖిలాడీ’ వంటి డిఫరెంట్ జోనర్ మూవీస్‌తో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రమేష్ వర్మ.. ‘మహావీర్ కర్ణ’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రమేష్ వర్మ.. ఇప్పుడు సరికొత్త జోనర్‌లోకి…
