సెప్టెంబర్ 25న ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’తో మరోసారి గ్రాండ్ రిలీజ్
మార్వెల్ అభిమానులకు మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు మార్వెల్ స్టూడియోస్ సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన *‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’*కు ప్రత్యేకమైన ఎంకోర్ ప్రదర్శనగా ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలోని థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఐమాక్స్ ®తో పాటు మార్వల్ Studios Presents ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్స్‌లోనూ ఈ స్పెషల్ ప్రెజెంటేషన్ అందుబాటులో ఉంటుంది. పెద్ద స్క్రీన్స్, మరింత ప్రకాశవంతమైన విజువల్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకులకు మరింత గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించనుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఇన్ఫినిటీ సాగాకు మహత్తర ముగింపుగా…
