ప్రేక్షకుల పల్స్ తెలిసిన టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ మారుతి ప్రేక్షకులు సినిమా నుంచి ఏం ఆశిస్తారో, ఎలాంటి కథను చూపిస్తే వారు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారో తెలిసిన అతికొద్ది మంది దర్శకుల్లో మారుతి ఒకరు. మారుతికి ఆడియన్స్ పల్స్ తెలుసు. వారిని ఎలా ఎంటర్ టైన్ చేయాలో తెలుసు. అందుకే అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే దర్శకుడిగా ఎదిగారు మారుతి. శిల శిల్పంలా మారినట్లు, చిన్న చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి ఇబ్బందులు పడి, అటు ప్రొడక్షన్ లోనూ అనుభవం సంపాదించి, సక్సెస్ ఫుల్ నిర్మాతగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మారుతి. చిన్న చిత్రాలతో థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ కంటెంట్ తో ఒక…
