భారతీయ సినీ రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖ నటుడు నానా పటేకర్, ప్రముఖ దర్శకుడు సింగీతం…
ప్రేక్షకుల పల్స్ తెలిసిన టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ డైరెక్టర్ మారుతి
ప్రేక్షకులు సినిమా నుంచి ఏం ఆశిస్తారో, ఎలాంటి కథను చూపిస్తే వారు థియేటర్ లో ఎంజాయ్ చేస్తారో తెలిసిన అతికొద్ది మంది దర్శకుల్లో మారుతి ఒకరు. మారుతికి ఆడియన్స్ పల్స్ తెలుసు. వారిని ఎలా ఎంటర్ టైన్ చేయాలో తెలుసు. అందుకే అటు యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే దర్శకుడిగా ఎదిగారు మారుతి. శిల శిల్పంలా మారినట్లు, చిన్న చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టి ఇబ్బందులు పడి, అటు ప్రొడక్షన్ లోనూ అనుభవం సంపాదించి, సక్సెస్ ఫుల్ నిర్మాతగా, దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు మారుతి.
చిన్న చిత్రాలతో థియేటర్స్ కు ప్రేక్షకుల్ని రప్పించాలంటే యూత్ ఫుల్ కంటెంట్ తో ఒక మంచి మెసేజ్ తో సినిమాలు చేయాలి. సరిగ్గా ఇదే ఫార్ములాతో ఈరోజుల్లో, బస్ స్టాప్ వంటి సినిమాలను రూపొందించారు మారుతి. కెరీర్ బిగినింగ్ లో ఆయన చేసిన ఈ సినిమాలు యూత్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడిగా మారుతి ప్రతిభ అందరికీ తెలిసింది. ఆయన ఆధ్వర్యంలోనే రూపొందిన ప్రేమ కథా చిత్రం పెద్ద విజయం అందుకుంది. మారుతి సక్సెస్ గాలివాటం కాదని ప్రూవ్ చేసింది. నాని హీరోగా మారుతి రూపొందించిన భలే భలే మగాడివోయ్ సినిమాతో దర్శకుడిగా ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గరయ్యారు మారుతి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఘన విజయం సాధించిన భలే భలే మగాడివోయ్ సినిమా మారుతి కెరీర్ లో అప్పటికి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత స్టార్ హీరోస్ దృష్టిని మారుతి ఆకర్షించగలిగారు.
ఆ తర్వాత శర్వానంద్ హీరోగా మారుతి రూపొందించిన మహానుభావుడు, సాయిదుర్గ తేజ్ తో తెరకెక్కించిన ప్రతి రోజు పండగే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఈ రెండు సినిమాల ఘన విజయాలు దర్శకుడిగా మారుతిని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. ఈ రెండు సినిమాలు మారుతి అంటే పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చేస్తారనే గుర్తింపు దక్కేలా చేశాయి. ఇవి కేవలం ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ మాత్రమే కాదు హ్యూమన్ వ్యాల్యూస్ ను గుర్తుచేసిన మూవీస్. రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి రూపొందించిన ది రాజా సాబ్ పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. ది రాజా సాబ్ తో చాలా కాలం తర్వాత ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో, కలర్ ఫుల్ గా చూపించడమే కాదు..టాలీవుడ్ గర్వించేలా టెక్నికల్ గా ఒక హై క్వాలిటీ మూవీని రూపొందించారు మారుతి.
ప్రస్తుతం మారుతి పలువురు హీరోలతో తన కొత్త సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వారిలో ఒక హీరోతో ఆయన త్వరలోనే సినిమా ప్రకటించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ పై మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ ఏర్పడుతోంది. అలాగే తన తరహా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కు కూడా మారుతి ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక యానిమేషన్ సినిమా రూపకల్పనకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాబోయో సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ..టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

