Skip to content

ఆస్మాన్’తో మేఘాంశ్‌కి మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను – శాంతి శ్రీహరి

శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం నాడు రిలీజ్ చేశారు. మోష‌న్ పోస్ట‌ర్ వీడియో గ‌మ‌నిస్తే.. సినిమాపై ఆస‌క్తి క‌లుగుతోంది. పెద్ద అర‌చేయి మ‌ధ్య‌లో హీరో మేఘాంశ్ కాగ‌డా ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నాడు. ఆ అర‌చేయికి సంబంధించిన నుదురు, దానిపై డిఫ‌రెంట్‌గా డిజైన్ చేసిన బొట్టును కూడా మోష‌న్ పోస్ట‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. అర‌చేయి చుట్టూ జ‌నాలంద‌రూ కాగడాల‌ను…

Read more

నాన్న‌గారిలా న‌న్ను కూడా ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను: మేఘాంశ్ శ్రీహ‌రి

శ‌నివారం (ఆగ‌స్ట్ 15) స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహ‌రి జ‌యంతి. ప్ర‌తీ ఏడాదిలాగానే ఆయ‌న జ‌యంతిని బాచుప‌ల్లిలోని మండ‌పం ద‌గ్గ‌ర ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇదే ప్రాంతంలోనే శ్రీహ‌రి కుమార్తె అక్ష‌ర స్మార‌క ప్రాంతం కూడా ఉంటుంది. శ్రీహ‌రి జ‌యంతి నిర్వ‌హ‌ణ కార్య‌క్ర‌మంలో శాంతి శ్రీహ‌రి, హీరో మేఘాంశ్ శ్రీహ‌రి, శ‌శాంక్ శ్రీహ‌రి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా.. హీరో మేఘాంశ్ శ్రీహ‌రి మాట్లాడుతూ ‘‘ఈరోజు నాన్న‌గారి 62వ బ‌ర్త్ డే. ఆయ‌న జ‌యంతిని నిర్వ‌హించాం. ఈ మండ‌పంలోనే చెల్లి అక్ష‌రకు చెందిన స్మార‌కం కూడా ప‌క్క‌నే ఉంటుంది. నాన్న‌గారి జ‌యంతి సంద‌ర్భంగా నేను న‌టించిన ఆస్మాన్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం. నాన్న‌గారికి అంద‌రూ ఆశీర్వ‌దించిన‌ట్లే న‌న్ను…

Read more