ప్రతి జర్నలిస్టు ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: ముద్దం నరసింహస్వామి
▪️తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఏఐ జర్నలిజంపై శిక్షణ ▪️ కామారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఆధునిక మీడియాపై అవగాహన ▪️ ఫేక్ న్యూస్, సైబర్ క్రైమ్, ఏఐ, సోషల్ మీడియాపై ప్రత్యేక శిక్షణ బాన్సువాడ, (కామారెడ్డి జిల్లా): మీడియా రంగం వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రతి జర్నలిస్టు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అర్థం చేసుకుని, అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్ట్, సాంకేతిక జర్నలిజం నిపుణుడు ముద్దం నరసింహస్వామి అన్నారు. కామారెడ్డి జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరచడంతో పాటు ఆధునిక మీడియా విధానాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, బాన్సువాడలో జర్నలిస్టుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్.ఆర్.ఎన్.కె. ప్రభుత్వ డిగ్రీ…
