జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న ‘‘మేము ‘కాప్’లం’’ సిరీస్
వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్‌ను అందిస్తోన్న టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 ఇప్పుడు మరో కొత్త సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. అదే ‘‘మేము ‘కాప్’లం’’. కామెడీ, మిస్టరీ కలయికగా రూపొందిన ఈ సిరీస్ అందరినీ మెప్పించే కథాంశంతో రూపొందుతోంది. గ్రామీణ నేపథ్యంలో, అక్కడి రోజువారీ జీవితం, స్థానిక రాజకీయాలు, ఊహించని గందరగోళం..ఇలా అన్నీ కలగలిపిన ఆసక్తికరమైన కథతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. తాజాగా సిరీస్ టైటిల్‌ను మేకర్స్ ఓ స్పెషల్ వీడియో ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అందులో గెటప్ శ్రీను, జాఫర్ కనిపించారు. ఆ వీడియో అన్నీ ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్‌గా మారి.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె…
