నమస్తే వరల్డ్‌తో ఏపీ ప్రభుత్వం రూ.36.24 కోట్ల ఒప్పందం.. 1,050 మందికి ఉపాధి అవకాశాలు
నమస్తే వరల్డ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించిన కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; సంస్థ 'గ్లోకల్' (Glocal) విధానంపై ప్రశంసలు విశాఖపట్నం, నవంబర్ 13, 2026: భూమా మౌనికా మంచు, నటుడు, వ్యాపారవేత్త మంచు మనోజ్ సంయుక్తంగా స్థాపించిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే స్టోరీటెల్లింగ్, టాయ్ స్టార్టప్ 'నమస్తే వరల్డ్' (Namasthe World), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేనేత, జౌళి రంగంలో కీలక ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. గురువారం విశాఖపట్నంలో జరిగిన 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) వేదికగా రూ. 36.24 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీని ద్వారా కర్నూలు, విశాఖపట్నంలో సస్టైనబుల్ అపెరల్, చేనేత, బొమ్మల తయారీ కేంద్రాలను ఏర్పాటు…
