‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం
అన్నదాన కార్యక్రమంతో మొదలైన 'నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనుంది : ట్రస్టీ చైర్మన్ నందమూరి మోహనకృష్ణ గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవతారకం గారి శతజయంతి సందర్భంగా నేడు ఆ కుటుంబ సభ్యులు ఆమె పేరుతో 'నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆమె జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులు వహిస్తూ చైర్మన్ గా నందమూరి…
