విశ్వదేవ్ హీరోగా సినిమా అనౌన్స్ మెంట్
"35 చిన్న కథ కాదు" సినిమా ఫేమ్ విశ్వదేవ్ హీరోగా మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా శ్రీ తులసి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా రాబోతోంది. "ముఖచిత్రం" సినిమా ఫేమ్ దర్శకుడు గంగాధర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నర్సి రాజగిరి అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఈ రోజు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ చేశారు. ఒక కొత్త తరహా కాన్సెప్ట్ తో న్యూ టాలెంటెడ్ డైరెక్టర్ నర్సి రాజగిరి ఈ సినిమాను రూపొందించే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. "ముఖచిత్రం" వంటి వైవిధ్యమైన సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గంగాధర్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతుండటం విశేషం. ముఖచిత్రం సినిమా…
