‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రేక్షకులను నిరాశపరచదు: హీరో సుమంత్
సుమంత్ హీరోగా ఈవిన్ నిర్మాణంలో తెరకెక్కిన యూనిక్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’. రాజేశ్ కర్ణ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కె.హరీశ్ నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రిమియర్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా మేకర్స్ యాక్షన్ రియాక్షన్ ఈవెంట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్. రాజేష్ 'అనగనగా' సినిమాకు ముందే ఈ కథను నాకు చెప్పారు. మంచి నిర్మాత కోసం ఎదురుచూశాం. 'అనగనగా' ఈటీవీ విన్‌లో పెద్ద హిట్ అయిన తర్వాత వాళ్లే ముందుకు వచ్చి ఈ సినిమా చేశారు. వాళ్లకు ఈ కథ చాలా నచ్చింది…
