తలసేమియాపై అవగాహన పెంచడమే లక్ష్యం: నారా భువనేశ్వరి
తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించడంతో పాటు, వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద నిర్వహించిన 3K, 5K, 10K తలసేమియా రన్ విజయవంతంగా జరిగింది. యువత, ప్రజలు పెద్ద ఎత్తున ఈ రన్‌లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి ఫ్లాగ్ ఆఫ్ చేసి రన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా ట్రస్ట్‌కు సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. ఈరోజు మనమందరం ఇక్కడికి ఒక గొప్ప కారణంతో పరిగెత్తడానికి వచ్చాం. ఒక ఐదు సంవత్సరాల పిల్లవాడు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తన…
