‘O.M’ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. నవంబర్ 20న గ్రాండ్ రిలీజ్!
జాతీయ అవార్డులు అందుకున్న వెర్సటైల్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: చాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నవంబర్ 20 న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇటీవలే 'అమరన్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రానికి కథను అందించి, స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రేజీ మల్టీస్టారర్‌లో ధనుష్, మమ్ముట్టిలతో పాటు నేచురల్ బ్యూటీ…
