ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఘనంగా ఇరుముడి కార్యక్రమం
ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో ఇరుముడి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో సోమవారం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. సీనియర్ నటులు, మాజీ ఎంపీ మురళీ మోహన్, సంతోషం అధినేత సురేశ్ కొండేటి పవిత్ర శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న వేళ, అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో ఇరుముడి పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమం భక్తులలో సరికొత్త ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఈ పవిత్ర క్రతువు కొనసాగింది. అయ్యప్ప నామస్మరణతో ఫిల్మ్ నగర్ ఆలయ ప్రాంగణం మారుమోగుతుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆధ్యాత్మిక మార్గంలో సాగిన ఈ వేడుకలో…
