సంగీత్ శోభన్ కామెడీ ఎంటర్‌టైనర్ అనౌన్స్‌మెంట్
సక్సెస్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ వరుసగా ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవల మలయాళంలోకి అడుగుపెట్టి బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ సంస్థ.. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు సాయి దుర్గ తేజ్ తదుపరి చిత్రాన్ని నిర్మిస్తోంది. అదే సమయంలో కంటెంట్ ఉన్న కథలకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ లీడ్ రోల్‌లో నటించనున్నారు. ప్రణయ్ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఆయన ‘సాహో’ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా…
