రజనీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో ఒకటిగా రూపొందుతున్న ‘ధర్మన్’లోకి మరో క్రేజీ హీరో చేరారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని భాగమయ్యారు. డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటన, ప్రత్యేకమైన ఎనర్జీతో రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘దేవదాస్’తో గుర్తుండిపోయే అరంగేట్రం చేసిన ఆయన, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. రామ్ ఎంట్రీని ప్రకటిస్తూ విడుదల చేసిన గ్లింప్స్‌లో స్టైలిష్ సర్ప్రైజ్ ఉంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన క్షణం ప్రేక్షకులను…
