సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా- ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ రాజ్‌కుమార్ రావ్ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులకు ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది. ఇదే సమయంలో ఈ సినిమాను 2027, మే 14న లాంగ్ హాలిడే వీకెండ్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అధికారికంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో 2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపిన ఐకానిక్ మూమెంట్‌ను రాజ్‌కుమార్ రావ్‌తో సినిమాటిక్‌గా రీక్రియేట్ చేసినట్లు చూపించారు…
