‘పెద్ది’లో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు జోడింపు- 400 కోట్ల క్లబ్ లో చేరిన పెద్ది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి విజయవంతంగా రన్ అవుతోంది. రెండు వారాలుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ పలు రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి మరింత బలంగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు కొత్త సన్నివేశాలను జోడిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి ప్రేక్షకులు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త ఫుటేజ్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. కొత్త సన్నివేశాలు రిపీట్ ఆడియన్స్ మరింత అలరించనున్నాయి. అంతేకాకుండా, ఈ చిత్రం గురువారం నుంచి రెగ్యులర్ టికెట్ ధరలతో అందుబాటులోకి రానుంది. టికెట్ ధరల తగ్గింపు ఫ్యామిలీ ఆడియన్స్…
