Skip to content

‘ట్రయల్ అండ్ ఎర్రర్’ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

నిర్మాత శరత్ మరార్ నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్‌ ‘ట్రయల్ అండ్ ఎర్రర్’ సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్ నటించిన స్టైలిష్ థ్రిల్లర్ ‘చీకటి రాజ్యం’కు దర్శకత్వం వహించిన రాజేష్ సెల్వ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకునే సత్యదేవ్.. ఈ సిరీస్‌ లో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథకు మరింత ఇంటెన్స్సిటీ తీసుకురానున్నారు. ఫరియా అబ్దుల్లా కూడా ఈ ప్రాజెక్ట్‌లో…

Read more

“డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్

"డేవిడ్ రెడ్డి" చిత్రంలో కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ 'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ…

Read more

“క్వీన్” సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రముఖ నటి రమ్యకృష్ణ

-ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది‌. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. "క్వీన్" చిత్రంలో ఒక పవర్ ఫుల్, స్ట్రాంగ్ క్యారెక్టర్ లో ప్రముఖ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి…

Read more