Skip to content

డిసెంబర్ 17న ఇండియాలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ విడుదల

భారతీయ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ దీపావళి కానుకగా డాక్టర్ డూమ్‌గా రాబర్ట్ డౌనీ జూనియర్, స్టీవ్ రోజర్స్‌గా క్రిస్ ఎవాన్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అమెరికా కంటే ఒక రోజు ముందుగానే డిసెంబర్ 17న ఇండియాలో విడుదల చేస్తున్నారు. ఈ దీపావళికి భారతీయ సినీ అభిమానులకు మార్వెల్ స్టూడియోస్ ప్రత్యేక కానుక అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ సినిమా అమెరికా కంటే ఒక రోజు ముందుగా 17 డిసెంబర్ 2026న భారతీయ థియేటర్లలో విడుదల కానుంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సినిమా విడుదలకు మరో 50 రోజులు మాత్రమే ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సందర్భంగా…

Read more

‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) అభిమానులు మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ రీ-రిలీజ్ అయిన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’కు భారత్‌లో భారీ స్పందన లభించింది. బాక్సాఫీస్ మోజో ప్రకారం, ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ ప్రపంచవ్యాప్తంగా తొలి వారాంతంలో సుమారు 86 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ఉత్తర అమెరికాలో 26 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్లలో 60 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. దీంతో థియేట్రికల్ రీ-రిలీజ్‌లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రానికి భారత్ కూడా భారీగా సహకరించింది. తొలి వారాంతంలో ఇండియాలో సుమారు 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు…

Read more

అవెంజర్స్ మరోసారి థియేటర్లలోకి – ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ చూడాల్సిన 5 కారణాలు

మార్వెల్ అభిమానులకు మరోసారి పండగ రాబోతోంది. 2019లో విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, అభిమానులు తమకు ఇష్టమైన సూపర్‌హీరోల వేషధారణలో థియేటర్లకు రావడం వంటి ఎన్నో ప్రత్యేక అనుభవాలను ఈ సినిమా అందించింది. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ మరోసారి ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరుతో థియేటర్లలోకి వస్తోంది. అలాగే త్వరలో ‘అవెంజర్స్: డూమ్స్‌డే’ రాబోతున్న నేపథ్యంలో ఎండ్‌గేమ్‌ను మరోసారి పెద్ద తెరపై చూడటానికి మరింత ఆసక్తి నెలకొంది. 1. మార్వెల్‌లో అతిపెద్ద ఈవెంట్‌ను మరోసారి ఆస్వాదించవచ్చు 22 సినిమాల్లో కొనసాగిన కథలు, పాత్రలను ఒకే సినిమాలో కలిపిన ఘనత ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’కు ఉంది. ఈ సినిమాను మరోసారి పెద్ద తెరపై…

Read more