యశ్ ‘టాక్సిక్’ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్
రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్ ‘టాక్సిక్’ మూవీని కొనుగోలు చేసింది. ఇది సినిమా అసాధారణ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్‌లో…
