రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ వాయిదా.. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న యుద్ద వాతావరణం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో టాక్సిక్‌ను మార్చి 19న విడుదల చేయడం భావ్యం కాదని మేకర్లు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్ 4, 2026కి వాయిదా వేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. జూన్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి ఫార్స్ ఫిల్మ్స్ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న…
