నారీ నారీ నడుమ మురారి’కి హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు: శర్వా
చార్మింగ్ స్టార్ శర్వా సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'నారీ నారీ నడుమ మురారి'. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. జనవరి 14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సంక్రాంతి విన్నర్ గా నిలిచి హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సంక్రాంతి విన్నర్ మీట్ నిర్వహించారు. సంక్రాంతి విన్నర్ మీట్ హీరో శర్వా మాట్లాడుతూ... అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. హిట్ కొడతానని చెప్పాను. చెప్పి కొట్టాను. ఇది గర్వంతోనో పొగరుతో మాట్లాడటం లేదు…
