‘ఓ మై డాగ్’ అందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమా: డైరెక్టర్ శశికిరణ్ తిక్క
అమిత్ రాయ్ దర్శకత్వంలో పంకజ్ త్రిపాఠి, రాజేష్ కుమార్, గీతా అగర్వాల్ శర్మ, పవన్ మల్హోత్రా, శ్రీధర్ దూబే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ మై డాగ్’. రాజేష్ భరద్వాజ్, అమిత్ రాయ్, సనా వార్సీ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 7న విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని అభినందిస్తూ దర్శకుడు శశికిరణ్ తిక్క ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రెస్ మీట్ లో దర్శకుడు అమిత్ రాయ్ మాట్లాడుతూ..“నేను హైదరాబాద్కు ఎన్నోసార్లు వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, దిల్ రాజు గారితో పాటు ఎంతోమందిని కలిశాను. కొన్ని ప్రాజెక్టులు కూడా…
