Skip to content

బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా సైమా అవార్డ్ అందుకున్న సత్యదేవ్

యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా అవార్డ్ అందుకున్నారు. ఇది ఆయనకు ఫస్ట్ సైమా అవార్డ్. కింగ్డమ్ సినిమాలో నటనకు గానూ సత్యదేవ్ ను ఈ అవార్డ్ వరించింది. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది "ఎస్ డి 15" మూవీ టీమ్. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ 15వ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. కింగ్డమ్ సినిమాలో హీరో విజయ్ దేవరకొండ సోదరుడిగా శివ పాత్రలో సత్యదేవ్ నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. "ఎస్ డి 15" సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ…

Read more
d9014954-9cbd-4289-a93b-5f2016c75b1e

‘కింగ్‌డమ్’ చిత్రం నుంచి ‘అన్న అంటేనే’ గీతం విడుదల

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కింగ్‌డమ్'. సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న 'కింగ్‌డమ్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి రెండవ గీతం 'అన్న అంటేనే' విడుదలైంది. 'కింగ్‌డమ్' నుంచి 'అన్న అంటేనే' గీతాన్ని బుధవారం(జూలై 16) సాయంత్రం విడుదల చేశారు నిర్మాతలు. ఉత్సాహవంతమైన గీతాలతో అందరినీ ఉర్రుతలూగిస్తున్న అనిరుధ్ రవిచందర్.. 'కింగ్‌డమ్' కోసం ఈ…

Read more
జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల Telugu News

జూలై 31న విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ విడుదల

అదిరిపోయే యాక్షన్ ప్రోమోతో కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం తెలుగులో రూపొందుతోన్న భారీ చిత్రాల్లో ‘కింగ్‌డమ్’ ఒకటి. విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, 'హృదయం లోపల' గీతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘కింగ్‌డమ్’ విడుదల కోసం విజయ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా చిత్ర విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. ‘కింగ్‌డమ్’ చిత్రం జూలై 31, 2025న ప్రపంచవ్యాప్తంగా…

Read more