‘జార్జ్ క్రిష్’ డబ్బింగ్ ప్రారంభం.. సంక్రాంతికి శర్వా హ్యాట్రిక్ హిట్ టార్గెట్!
వరుసగా రెండు హిట్లు కొట్టిన చార్మింగ్ స్టార్ శర్వా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'జార్జ్ క్రిష్'తో హ్యాట్రిక్ హిట్ పూర్తి చేయడానికి సిద్ధమవుతున్నాడు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏటీవీ సమర్పిస్తుండగా, అజయ్ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన జార్జ్ క్రిష్ ఫస్ట్ బూస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇందులో శర్వానంద్‌ను రెండు విభిన్న మతాలకు చెందిన పాత్రల్లో పరిచయం చేశారు. క్రిస్టియన్‌గా జార్జ్, హిందువుగా క్రిష్ పాత్రల్లో శర్వా అలరించారు. పూర్తిగా భిన్నమైన పరిస్థితుల్లో ఈ రెండు పాత్రలను చూపిస్తూ…
