‘బైకర్’ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX ఫార్మాట్‌లలో ఏప్రిల్ 3న రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా అడ్రెనలిన్ ఫిల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బైకర్, భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ స్పెక్టాకిల్‌గా రూపొందుతోంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిUV క్రియేషన్స్ నిర్మిస్తోంది. కుటుంబ భావోద్వేగాలతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రం డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా విడుదల కానుంది. దీంతో ప్రేక్షకులకు మరింత ఇమర్సివ్ థియేట్రికల్ అనుభూతి అందించనుంది. హార్ట్-పౌండింగ్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్స్, సౌండ్ డిజైన్, హై-ఆక్టేన్ యాక్షన్‌పై…
