‘ఎల్లమ్మ’ తో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం
అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం' ఎల్లమ్మ'ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో నిండిన కథని సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లతో దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కెమెరా ముందు అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయడం ఎక్సయిట్మెంట్ ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అరంగేట్రానికి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ ఆయన ఎనర్జీ, క్రియేటివ్ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో…
