తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును అందించిన హీరో కృష్ణసాయి
▪️రెడ్ క్రాస్ సొసైటీకి మద్దతుగా విరాళం ▪️ అభినందించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా హైదరాబాద్: టాలీవుడ్ హీరో కృష్ణసాయి తన సేవా కార్యక్రమాలతో మరోసారి ప్రశంసలు అందుకున్నారు. తన ఆధ్వర్యంలో నడుస్తున్న ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలకు మద్దతుగా తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాకు రూ.4 లక్షల చెక్కును విరాళంగా అందించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు ఆదర్శంగా నిలుస్తూ సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కృష్ణసాయిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు అంశాలపై వీరిద్దరు చర్చించుకున్నారు. కృష్ణసాయి తన ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు…
