‘ఓ నా సిద్ధయ్య’ సాంగ్ లాంచ్ చేసిన సోనూసూద్, ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్
భారీ వర్షంలోనూ 5 వేల మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో గ్రాండ్‌గా పాట విడుదల.. అవుట్‌డోర్‌లో 70ఎంఎం స్క్రీన్, డాల్బీ అట్మాస్ సౌండ్‌తో సరికొత్త అనుభూతి సినిమా థియేటర్‌లో చూసే అనుభూతిని అవుట్‌డోర్‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే వినూత్న ఆలోచనతో ‘ఓ నా సిద్ధయ్య’ టీమ్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. భారతదేశంలోనే తొలిసారిగా అవుట్‌డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. అక్టోబర్ 30న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో జరిగిన ఈ వేడుకకు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రేక్షకుల…
